గ్రామభారతి ప్రదర్శనశాలను సందర్శించిన గవర్నర్ దత్తాత్రేయ

గ్రామభారతి ప్రదర్శనశాలను సందర్శించిన గవర్నర్ దత్తాత్రేయ

గ్రామభారతి ప్రదర్శనశాలను సందర్శించిన గవర్నర్ దత్తాత్రేయ…

గ్రామీణ ఉత్పత్తులను గో ఆధారిత ఉత్పత్తులను సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో గ్రామ భారతి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ వైభవం పేరిట ప్రఖ్యాత భారతి నిర్వహించిన సదస్సులో ఏర్పాటుచేసిన గ్రామ భారతి ప్రదర్శనశాలలు గవర్నర్ దత్తాత్రేయ సందర్శించి గ్రామ భారతి సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలని అన్నారు. గో ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించి కాలుష్య రహిత ఆరోగ్యవంతమైన భారతీయ సమాజాన్ని నిర్మించాలని కోరారు. సేంద్రియ వ్యవసాయాన్ని గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసే విధంగా యువతీ యువకులను ప్రోత్సహించాలన్నారు. గవర్నర్ దత్తాత్రేయ వెంట పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గ్రామ భారతి తెలంగాణ రాష్ట్ర సంయోజకులు జిన్న సత్యనారాయణరెడ్డి ఆర్ ఎస్ ఎస్ కరీంనగర్ కార్యదర్శి దావులూరి మురళీధర్ తదితరులు ఉన్నారు

comments powered by Disqus