మనమే ధరలను నిర్ణయిద్దాం - గ్రామభారతి, కరీంనగర్

మనమే ధరలను నిర్ణయిద్దాం - గ్రామభారతి, కరీంనగర్

వస్తువును తయారుచేసిన ఉత్పత్తిదారే ఆ వస్తువు ధరను నిర్ణయిస్తాడు. మరీ వ్యవసాయ రంగంలో దళారులు ధరలు నిర్ణయించడమేంటీ? ఇకపై మనమే ధరలను నిర్ణయించేలా కార్యాచరణతో ముందుకు సాగుదామని గ్రామభారతి సదస్సు వేదికగా రైతులు నిర్ణయించారు. రైతు ఉత్పత్తి సంస్థ పేరుతో ధరలను ఖరారు చేసుకునే పరిస్థితులు సృష్టిద్ధామని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని కృషిభవన్‌లో గ్రామభారతి నేతృత్వంలో సదస్సును నిర్వహించారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు, వినియోగదారులు, అమ్మకపుదారులు ప్రకృతి పర్యావరణ సంరక్షకులు, గోశాల నిర్వహణదారులు, గోసేవకులు, గోసంరక్షకులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ సమస్యలు, పరిష్కార మార్గాలు, పర్యావరణ పరిరక్షణ, జలసంరక్షణ, గోపోషకులు-ఉత్పత్తిదారులు వంటి అంశాలపై వేర్వేరుగా చర్చించారు. గ్రామభారతి రాష్ట్ర అధ్యక్షుడు సూద్ని స్తంబాద్రిరెడ్డి మాట్లాడుతూ.. సేంద్రియ రైతులు ప్రధాన పంటలతో పాటు అంతర పంటలను సాగు చేయాలని కోరారు. పర్యావరణ సామాజిక కార్యకర్త సురేష్‌గుప్తా మాట్లాడుతూ..

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి చేతి సంచులను, మహిళా స్వయం ఉత్పత్తులను వాడాలని అన్నారు. చేనేత కార్మికులను ప్రొత్సహించడానికి చేనేత వస్త్రాలు ధరించాలన్నారు. సోలార్‌ వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రాంత గోసేవా ప్రముఖ్‌ రామారావు మాట్లాడుతూ..

గో ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. మార్కెటింగ్‌ అంశాలపై ప్రవీణ్‌, సామ ఎల్లారెడ్డి, సేవ్‌ విజయ్‌రామ్‌, రైతు ఉత్పత్తి సంస్థ గురించి ప్రొఫెసర్‌ సౌమిని కళ్యాణి, నాబార్డు ఏజీయం అనంత్‌లు వివరించారు. కార్యక్రమంలో గ్రామ భారతి గౌరవ అధ్యక్షుడు సముద్రాల జనార్ధన్‌రావు, కరుణాకర్‌, కోమటిరెడ్డి రాజారెడ్డి, కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత సంఘచాలక్‌ దక్షిణమూర్తి, ప్రాంత గ్రామ వికాస ప్రముఖ్‌ సత్యనారాయణరెడ్డి, సుందర్‌రెడ్డి, సూర్యకళ, డా.పద్మ, మురహరిరావు, డా. గాడిపల్లి నాగేశ్వరరావు, తోట లక్ష్మణరావు తదితరులున్నారు.

Jinna Balu
Jinna Balu Platform Engineer @ Wisestep Inc, Developer and maintainer of Platform Ops
comments powered by Disqus